Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రేమలో పడటం వల్లనే కొన్ని ఛాన్సులు చేజారాయి: రెజీనా

  • నటిని కావాలనేది నా కోరిక
  • అనుకున్నది నెరవేరింది 
  • కానీ లవ్ లో పడటంతో గ్రాఫ్ తగ్గింది 
  • ఇకపై ఇలాంటి పొరపాట్లు చేయను  
తెలుగు తెరకి పరిచయమవుతూనే రెజీనా వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. కొన్ని సక్సెస్ లు కూడా ఆమె ఖాతాలో వున్నాయి. ఆమె జోరు బాగానే కొనసాగుతుందని అంతా అనుకున్నారు. అయితే అనుకోకుండా ఆమె కెరియర్ గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. అందుకు కారణం తాను ప్రేమలో పడటమేనని తాజా ఇంటర్వ్యూలో రెజీనా చెప్పుకొచ్చింది.

"నటిని కావాలనేది నా కోరిక .. అందుకే నేను ఈ రూట్లోకి వచ్చాను. పదేళ్ల కెరియర్లో ఎన్నో మలుపులు చూశాను. ప్రేమలో పడటం వంటి పొరపాట్లు కూడా చేశాను. పొరపాటు చేస్తున్నాను అని తెలుసుకునేలోగా కొన్ని అవకాశాలు చేజారిపోయాయి. ఫలితంగా ఆశించిన స్థాయిని అందుకోలేకపోయాను. ఇక ఇప్పుడు నా దృష్టంతా కెరియర్ పైనే. మంచి అవకాశాలను దక్కించుకుంటూ .. సక్సెస్ లను సొంతం చేసుకుంటూ నేనేంటో నిరూపించుకోవాలని అనుకుంటున్నాను" అంటూ చెప్పింది.      
regina

More Telugu News